AP: మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో నెలన్నర కిందట మున్సిపల్ అధికారులు జనసేన కార్యకర్త వెంకటాచలం ఇల్లు కూల్చివేశారు. ఆ ఇల్లు ఎందుకు కూల్చారో చెప్పాలంటూ నిన్న కృష్ణా జిల్లా దిశా సమావేశంలో MP బాలశౌరి నిలదీశారు. ఇంటిని కూల్చడానికి పోలీస్ బందోబస్తు ఎవరిచ్చారు? ప్రైవేట్ ప్రాపర్టీ గొడవలోకి మీరెందుకెళ్లారని నిలదీశారు. MP ప్రశ్నలకు మున్సిపల్ కమిషనర్ మౌనంగా ఉండిపోయారు.