TG: రైతుల ధాన్యం కొనుగోలు తర్వాత టోకెన్ ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. చాలా చోట్ల టోకెన్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు ఇవ్వనివారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరిపడా లారీలు అందుబాటులో లేవని చెప్పారు.