ప్రధాని మోదీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం 9వ విడత షెడ్యూల్ ఖరారైంది. 2026 జనవరిలో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించి, పరీక్షలను ఉత్సవంలా భావించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్ధేశం. డిసెంబర్ 1న ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు 2026 జనవరి 11 వరకు కొనసాగుతాయి.