చిరుతలు జనావాసాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో మేకలను అడవుల్లోకి వదిలిపెట్టాలని మహారాష్ట్ర మంత్రి గణేష్ నాయక్ సూచించారు. చనిపోయిన తర్వాత బాధితులకు పరిహారం అందించే బదులు.. అదే డబ్బుతో వచ్చే మేకలను అడవిలోకి వదిలివేయాలన్నారు. ఈ మేరకు అధికారులకు సూచించినట్లు తెలిపారు.