AP: ఈనెల 11న ధర్మవరం నుంచి అటల్-మోదీ సుపరిపాలన యాత్ర ప్రారంభించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడించారు. ‘అటల్ ఆశయం.. మోదీతో సుసాధ్యం’ పేరిట బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. 25న అమరావతిలో బహిరంగ సభతో యాత్ర ముగింపు ఉంటుందని మాధవ్ పేర్కొన్నారు.