మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలారా చెవులు రిక్కించి వినండన్నారు. ప్రపంచంలో ఏ శక్తి ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురాలేదన్నారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక్కటేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అవమానించాలని చూసిందన్నారు. రెండు రాజ్యాంగాలుండాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని మెదీ పేర్కొన్నారు.