AP: మిర్చి పంటలో తెగుళ్లపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. దీనికి సంబంధించి ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో మాట్లాడిన మంత్రి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. సంబంధిత శాస్త్రవేత్తలను వెంటనే క్షేత్రస్థాయికి పంపించాలని సూచించారు. రైతులకు నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.