TG: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న యోలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.