AP: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. సోమిరెడ్డి అనుచరుల ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన అరెస్టయి 85 రోజుల పాటు జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలు అవినీతిని ప్రశ్నించినందుకే ఆయన అక్రమ కేసు పెట్టారని వైసీపీ ఆరోపించింది.