వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాలన్న CEOకు ఉద్యోగులు షాక్ ఇచ్చారు. పారామౌంట్, స్కైడాన్స్ మీడియా విలీనం తర్వాత CEO డేవిడ్ ఎల్లిసన్ WFH చేస్తున్న వారందరూ వారానికి 5 రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించారు. లేదంటే స్వచ్ఛందంగా వైదొలగాలని సూచించారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయిలో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులు ఎల్లిసన్ ఆఫర్ను స్వీకరించి రిజైన్ చేశారు.