TG: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం కాదు.. మజ్లిస్ విజయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ అనేక ఉపఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిందన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాలు కచ్చితంగా మారతాయన్న ఆయన.. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమన్నారు.