TG: ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం తడిచిపోయిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. వరి, మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేశామంటూ సీఎం బాధ్యతరహితంగా ప్రకటనలు చేశారని విమర్శించారు. రైతులు పంటలు అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.