TG: హైడ్రాకు ప్రజలు సపోర్టు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన హైడ్రా ప్రథమ వార్షికోత్సవంలో రంగనాథ్ మాట్లాడారు. పార్కులు, నాళాలు, చెరువులను కబ్జాల నుంచి హైడ్రా కాపాడుతుందని తెలిపారు. స్వార్థపరులు ప్రభుత్వ భూములను కొట్టేయాలని చూస్తున్నారని, బతుకమ్మ కుంటను హైడ్రా పునరుద్ధరించగలిగిందని చెప్పారు.