TG: సర్పంచ్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉన్నా.. చాలాచోట్ల భర్తలే అనధికార పెత్తనం చేస్తుంటారు. భార్యను గెలిపించి, కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి అధికారం మాత్రం తమదే అన్నట్లు భావిస్తారు. అయితే ఇకపై ఈ ‘సర్పంచ్ పతి’ గిరీ సాగదు. మహిళా సర్పంచ్ల అధికారాల్లో భర్తలు వేలు పెడితే.. చట్టపరమైన చర్యలతో పాటు ఏకంగా పదవే ఊడగొడతామని అధికారులు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.