AP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ‘మహాయుతి’ కూటమి విజయం సాధించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఈనెల 16, 17వ తేదీల్లో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాలపై తాజాగా పవన్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. మోదీ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు నమ్మకం ఉంచారని.. నిజాయితీ, అభివృద్ధికి ఓటేశారని పేర్కొన్నారు. ఫడణవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ సమిష్టిగా పోరాడారని కొనియాడారు.