TG: అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఇవాళ పలు పార్టీలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాయి. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ప్రభుత్వ కార్యక్రమాలపై BRS తీర్మానం పెట్టనుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఇచ్చిన హామీలపై బీజేపీ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చకు సీపీఐ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది.