TG: పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. తొలి విడత పోలింగ్ జరిగే 11వ తేదీతో పాటు 10న కూడా స్కూళ్లకు సెలవు. ఇక రెండో దశ పోలింగ్ 14న జరగనుండగా.. 13న రెండో శనివారం. అటు మూడో దశ జరిగే 17వ తేదీతో పాటు 16న కూడా స్కూళ్లకు సెలవు. పంచాయతీ పోలింగ్ తేదీల్లో ఆయా పాంత్రాల్లోని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఉంటుంది.