TG: రైతులతో రాజకీయాలు చేయడం రేవంత్‌కు అలవాటు అని ఎంపీ రఘునందన్ విమర్శించారు. 80 శాతం కొనుగోలు ఎక్కడ జరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రైతు గోసా- బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలపై రైతులతోనే మాట్లాడిస్తామని తెలిపారు.