AP: విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు అంశాలపై సమీక్షించారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఎంవోయూలు కుదుర్చుకోవాలని సూచించారు.