TG: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతి గృహంలో కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థులకు అధికారులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.