బీహార్‌లోని కీలక నియోజకవర్గం రాఘోపూర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వెనుకంజలో కొనసాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం (17వ రౌండ్ ముగిసే సమయానికి) తేజస్వీ సుమారు 7,500 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి వెనుకంజలో ఉండటం కూటమికి ఆందోళన కలిగిస్తోంది.