TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏ ఇద్దరు కలిసినా, టీ స్టాళ్లు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు వీటికి వేదికలుగా మారుతున్నాయి. పోలైన ఓట్లు ఎన్ని? గెలిచే అవకాశం ఎవరికి ఉంది? ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఫలితాలు నిజమేనా ? అంటూ మాట్లాడుకుంటున్నారు.