AP: మదురై ఆలయంలో దీపం వివాదంపై ఇండి కూటమి ఎంపీల చర్యలపై Dy.CM పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ ఆచారాలను సమర్థించిన జడ్జిని టార్గెట్ చేశారని మండిపడ్డారు. శబరిమల తీర్పు సమయంలో ఇలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. హిందూ భక్తుల హక్కులు కూడా రాజ్యాంగ హక్కులే అన్నారు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని పేర్కొన్నారు.