AP: నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, జోగి రామును ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్‌పై జోగి సోదరులను కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ చేపట్టిన కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు జోగి సోదరులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు.