AP: రాష్ట్రంలో పీఎం కుసుమ్, రూఫ్‌టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని తెలిపారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలని చెప్పారు. అలాగే, ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.