AP: రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కంట్రోల్ రూమ్లు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. ఏలూరు, ప్రకాశం. ప.గో., పల్నాడు, సత్యసాయి జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.