TG: దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో డ్రోన్లకు ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటినీ JSW కంపెనీ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో JSW డ్రోన్ కంపెనీ ఏర్పాటుకు పార్థ జిందాల్ భూమి పూజ చేశారు. రూ.8వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.