TG: అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం రేవంత్ సర్కార్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టింది.. అమ్మకపోతే పూట గడవని పరిస్థితి. లక్ష కోట్లు మద్యం అమ్మకం ద్వారా సంపాదించాలని అనుకుంటుంది. రెండు పార్టీలు అక్రమాలకు పెద్ద పీట వేసే పార్టీలు.. కుటుంబ పార్టీలు, ఫిరాయింపులకు పాల్పడే పార్టీలు’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.