AP: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెయింటింగ్‌లో ఉన్న ఇద్దరు ఐపీఎస్‌లకు పోస్టింగ్స్ ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ ఏఐజీగా ఐపీఎస్ కృష్ణకాంత్, అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ సురేష్ బాబులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్వర్వులిచ్చారు.