మధ్యప్రదేశ్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సాత్నా జిల్లాలోని కోథీ పట్టణానికి చెందిన పీయూష్ అగర్వాల్ అనే వ్యక్తి రూ.12 బకాయి పడ్డారని పేర్కొంటూ విద్యుత్ శాఖ లీగల్ నోటీసులు పంపింది. గడువులోగా చెల్లించడంలో విఫలమయ్యారని రూ.12 బకాయికి అదనంగా రూ.12 పెనాల్టీ చెల్లించాలని తెలిపింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.