TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీ 1,082 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండు రౌండ్లు కలిపి మొత్తం 1,144 ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లో 47 ఓట్లు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకెళ్తుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు గెలుపు ధీమాలో ఉన్నారు.