కేరళలోని వయనాడ్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె ఆధిక్యంపై తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘కౌంటింగ్ ప్రారంభంలోనే మా నాయకురాలు భారీ మెజార్టీ కనబరిచారు. వయనాడ్ ప్రజలు ఇవాళ అద్భుతమైన గెలుపును నమోదు చేయబోతున్నారు. ప్రియాంకా గాంధీ భారీ విజయంతో పార్లమెంటులో అడుగుపెడతారు’ అని పేర్కొన్నారు. కాగా, ప్రియాంక ఇప్పటివరకు 2 లక్షల ఓట్ల మెజార్టీని దాటారు.