దుబాయ్‌లో భారతీయ యువకుడు మహమ్మద్ మిషాల్(19) మృతి చెందాడు. ఫొటోగ్రఫీ అయిన మిషాల్ పర్యాటక వీసాపై దుబాయ్ వెళ్లగా.. అక్కడి విమానాశ్రయంలోని విమానాలను ఫొటో తీసేందుకు సమీప భవనంపైకి ఎక్కాడు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కిందపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు కేరళలోని కోజికోడ్‌కు చెందినవాడు.