TG: ఎన్నికల బరిలో దిగుతున్నారా? అయితే జాగ్రత్త. చిన్న తప్పు జరిగినా మీ నామినేషన్ రిజెక్ట్ అవుతుంది. సరైన సర్టిఫికెట్లు లేకపోయినా, అభ్యర్థి–ప్రపోజర్ సంతకాల్లో లోపాలు ఉన్నా, ఫార్మాట్ తప్పున్నా అధికారులు ఊరుకోరు. ప్రపోజర్ ఆ వార్డు ఓటర్ కాకపోయినా, రిజర్వేషన్ అర్హత లేకపోయినా అంతే సంగతులు. ఆస్తులు, కేసులు, చదువు వివరాల డిక్లరేషన్ ఇవ్వకపోయినా నామినేషన్ కొట్టిపారేస్తారు.