TG: గ్లోబల్ సమ్మిట్‌పై BJP MLA పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రియల్ ఎస్టేట్ సంస్థ బ్రోచర్ ఓపెనింగ్‌ల ఉందని విమర్శించారు. తనను పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను పట్టించుకునే నాథుడే లేడని.. కనీసం కుర్చీ వేసిన దిక్కు కూడా లేదని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గ్రాఫిక్ షో చూపిస్తున్నారన్నారు.