ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కళ్లు తిరగడం, బలహీనపడటం వంటి సమస్యలు వస్తాయి. మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల మధ్యాహ్నం భోజనం అధికంగా తినడం వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉంది. అల్సర్, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. తీవ్రమైన తలనొప్పి, చికాకు, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.