AP: సాధుసంతులను కించపరిచేలా భూమన మాట్లాడటం బాధాకరమని రాష్ట్ర సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద అన్నారు. వైసీపీ హయాంలో హిందువులపై జరిగిన దాడులు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి అక్రమ ఆస్తులపై ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం సాధువులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.