AP: 18 నెలల కూటమి పాలనపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాడేరు మెడికల్ కాలేజీకి 100 MBBS సీట్లు మంజూరు చేశామన్నారు. మరో 4కాలేజీల్లో అడ్మిషన్స్‌కు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. వైద్యుల నిర్లక్ష్య ధోరణులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జవాబుదారీతనాన్ని పెంచడం HODల బాధ్యత అని అన్నారు.