ఢిల్లీ పేలుడు ఘటనలో మరో కారు కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. అనుమానిత కారు నెంబర్ DL10CK0458గా గుర్తించారు. డా. ఉమర్ పేరుతో ఫోర్డ్ కారు రిజిస్టర్ అయిందని అధికారులు తెలిపారు. వెంటనే కారును గుర్తించాలని అన్ని పోలీస్ స్టేషన్లను నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. ఈ మేరకు జమ్మూకశ్మీర్, హర్యానా, యూపీ, ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.