AP: నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మాణానికి సంబంధించి ఈనెల 18న సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గత నెల 24న 40 మంది కార్పొరేటర్లు జేసీ వెంకటేశ్వర్లను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు.