AP: ఈనెల 18న నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 54 మంది కార్పొరేటర్లలో టీడీపీకి 42 మంది మద్దతు పలికారు. దీంతో కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలని కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానం తేదీని ప్రకటించారు.