TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్నిగంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట్, గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వాన పడేందుకు ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది. దీంతో ఆయా జిల్లాలకు అధికారులు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.