డయాబెటిస్ ఉన్నవారికి వేసవిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో నేరేడు పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే జాంబోలిన్ అనే ప్రత్యేక మూలకం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. వేసవిలో గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు తలెత్తుతాయి. నేరేడు పండులో ఫైబర్, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను పటిష్టం చేసి.. కడుపు నొప్పి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.