AP: తిరుపతిలో అయ్యప్పస్వామి భక్తులు ఆందోళన చేస్తున్నారు. కపిలేశ్వర స్వామి ఆలయం జలపాతం, పుష్కరిణీలో అయ్యప్ప భక్తుల స్నానాలపై టీటీడీ ఆంక్షలు విధించింది. దీంతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. దీంతో టీటీడీ అరగంట పాటు స్నానాలకు అనుమతి ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.