TG: కోనసీమకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పవన్ కళ్యాణ్.. ఒంటరిగా గెలవలేక కమ్మ, కాపు సామాజిక వర్గాలను ఏకం చేసి, సినిమాలో లాగా సమయానికి చంద్రబాబు వచ్చి కాపాడితే గెలిచి ఉపముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. అలాంటి పవన్.. తెలంగాణ మీద ఎందుకు ఏడుస్తారని మండిపడ్డారు.