బీహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీహార్లో NDA ప్రభంజనం కనిపిస్తోందని, ప్రజలు మళ్లీ ‘జంగిల్ రాజ్’ రావొద్దని కోరుకున్నారని అన్నారు. మోదీ నాయకత్వంలో సంస్కరణలు, దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడేశారన్నారు. ఈసీని విమర్శిస్తే ఓట్లు పడవని కాంగ్రెస్ తెలుసుకోవాలని పేర్కొన్నారు.