పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలులో ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఆయనను మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. ఇమ్రాన్ మృతి చెందినట్లు ఇటీవల విస్త్రృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో మాజీ ప్రధానిని కలిసేందుకు ఆమెకు అధికారులు అనుమతించారు.