బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇప్పటివరకు ఎన్నికల్లో రాహుల్ 95 సార్లు ఓడిపోయారని ఎద్దేవా చేసింది. ఓటమి అనేది క్రీడ అయితే.. అందులో రాహుల్ ట్రోఫీ కేబినెట్ ఇప్పటికే నిండి ఉండేదంటూ సెటైరికల్ పోస్ట్ చేసింది. ఓటమి ఎదురైనప్పుడల్లా నిందించడానికి ఆయన వద్ద కొత్త లక్ష్యం సిద్ధంగా ఉంటుందని విమర్శించింది.