AP: టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాజీమంత్రి కారుమూరి మండిపడ్డారు. యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఫైర్ అయ్యారు. ‘తిరుమలలో గొల్ల మండపాన్ని కూల్చిందే చంద్రబాబే. తిరుమలలో యాదవులకు వంశపారంపర్య హక్కును తిరిగి తీసుకొచ్చింది జగన్. శ్రీకాకుళం చరిత్రలో యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చింది జగనే’ అని పేర్కొన్నారు.