ఢిల్లీలో BJP జాతీయాధ్యక్షుడు JP నడ్డా నివాసంలో రేపు NDA నేతలు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 లేదా సాయంత్రం 4 గంటలకు సమావేశం అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి AP సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.